Sunday, 17 July 2022

Song on #MHK


https://youtu.be/ZgzeeI8q3dc


 పల్లవి :


శాయంపేట చిన్నోడు సాయం చేసే స్నేహితుడు

స్వరాజ్యమమ్మా సుదర్శనుల ఇంట అడుగేసిన హరికృష్ణుడు


మనిషిని చదివే మాంత్రికుడు నిష్కల్మషమైన మనిషితడు

తెలంగాణా కళా సమూహముకు జాన్ జిగిరి దోస్త్ ఇతడు


చరణం :


అమ్మ స్ఫూర్తి తో అక్షరాలతో దోస్తీ చేసి

తొమ్మిదవ తరగతి లోనే సాహిత్యం వడపోసి


ఫ్యూజన్ థియరీ అను ప్రక్రియకు ప్రాణం పోసి

ప్రపంచ కవిత గా జనం గుండెలో స్థానం పొందేసీ


సినిమా సాహిత్యం కళలు సైకాలజీ

విషయం ఏదైనా గల గల సంభాషణే తన స్ట్రాటజీ


అతడి పలుకులతో గడ గడ లాడెను రవీంద్ర భారతి

ప్రాణం పెట్టి పడుతున్నాడు కళలకు హారతి


చరణం :


ప్రభుత్వ ఉద్యోగిగా పలు పదవులనలంకరించి

సాంస్కృతిక శాఖా సంచాలకుడిగా వినూత్న పంథా లో పయనించి


తెలంగాణా కళారాధనలు జానపద జాతరలతో

కళాకారులకు ఉపాధినిచ్చే ఎన్నెన్నో పథకాలతో


Local నుండి వరల్డ్ సినిమా దాకా వేదిక నిండా వేడుకలే

ప్రతి శనివారము సినీవారమే పైడి జయరాజు స్మరణలో


అతడి మేధకు పరవశించెను రవీంద్ర భారతి

ప్రాణం పెట్టి పడుతుంటాడు కళలకు హారతి





No comments:

Post a Comment