మబ్బుల ముల్లె!
---- మామిడి హరికృష్ణ 8008005231
సాహిత్యం ఓ కారు మేఘం!
ఏ గాఢ సాంద్ర భావ సమూహాల సంచయమో
ఒక్కచోట చేరి,
ఒకానొక ఉద్విగ్న క్షణాన
వానై, తుహినమై కురుస్తుంది!
కవిత్వమై మురుస్తుంది!
కవిత్వం ఓ నీటి గుమ్మి!
దాని తడిదనం అరచేతులకు అంటుతోంది
కానీ దోసిలిలోకి ఇమడదు
జీవితం లా జారిపోతుంది !!
జీవితం ఓ మబ్బుల ముల్లె !
కన్నీరు చినుకులను
చిరునవ్వుల మెరుపులను
గాలిలో తేలుతూ తీసుకువస్తుంది
చీకటికి చిక్కక
వెలుగుకు అందక
దాగుడుమూతలాడుతుంది
దాచుకోవడానికి ఏమీ మిగల్చకుండా
ఆవిరై పోతుంది !!
#mhk_poetry
No comments:
Post a Comment