Monday, 8 June 2020

ఇది వికాస గీతాంజలి

Here, it's my analytical article on the journey and contribution of TELANGANA SAMSKRUTIKA SARATHI, published in MANA TELANGANA paper on 1-6-2020...

        మన నిత్య వ్యవహారంలో జంట పదాలు కొన్ని ఉన్నాయి. ఇల్లువాకిలి, పొలం పుట్ర, నింగి-నేల, రేయిపగలు, సూర్యచంద్రులు, రామలక్ష్మణులు, పనిపాట… ఇంకా ఎన్నో…! 
      ఇలాంటి జంట పదాలన్నింటిలో మానవ జీవన పరిణామాన్ని నడిపించి, గెలిపించి, మురిపించి, మరిపించి, మెప్పించిన జంటపదం, ఒకవైపు మానవ శ్రమకు మరోవైపు మానవ సృజనకు నిలువెత్తు సంతకంలా నిలిచిన జంటపదం-- ‘పనీపాట’!
      ‘పని’ మనిషిలోని శక్తిసామర్థ్యాలను, ఉత్పాదక నైపుణ్యాన్ని సష్టికి ప్రతి సష్టి చేయ గలిగిన ప్రతిభను సానబెట్టి, నిగ్గుతేల్చిన విశిష్ట లక్షణం! 
    అయితే, ‘పాట’ మనిషిలోని రాగ జీవనానికి, లయాత్మకతకు, సజనాత్మక వ్యాసంగానికి, విభిన్న ఆలోచనాధారను మేళవించి, అనుభవాన్ని అనుభూతుల్ని రంగరించి వాక్యాల దేహాల నిండా సంగీతాన్ని సమకూర్చిన వైవిధ్య లక్షణం.
అందుకే, పనితో పాటే పాట పుట్టింది…! 

పాటను అల్లుకుని పని మరింత మెరుగు పడింది. అలాంటి పనికి పుట్టినిల్లు తెలంగాణా!, 
అలాంటి పాటకు పట్టుగొమ్మ తెలంగాణా!, 
శతాబ్దాల కాలం నుండి పనీ పాటలు చెట్టా పట్టాలేసుకుని సంచరిస్తున్న పుణ్య భూమి తెలంగాణా!, 
     అందుకే, మన పల్లెల్లో గ్రామీణ జీవనంలో తుమ్మెద పాటలు, దంపుడు పాటలు, ఉయ్యాల పాటలతో పాటు పండుగ పాటలు, బతుకమ్మ పాటలు జానపదాలుగా, జనజీవన నదాలుగా అనాది కాలం నుంచీ ప్రవహిస్తున్నాయి.  

     జానపదులు మట్టిని, మనిషిని, నింగినీ, నేలను, ప్రకతిని, పిట్టను, చెట్టును, అడవిని మానవ బంధాలను, తమ పాటల్లో కీర్తించుకున్నారు.
సంబరాన్ని, దుఃఖాన్ని, ద్వేషాన్ని తిరుగుబాటును పోరు బాటను, త్యాగాన్ని వీరత్వాన్ని తమ పాటల్లో వల పోసుకున్నారు. 
       తమ మాటలనే పాటలుగా మలిచి, వాటికి రాగాల రెక్కలు తొడిగి, ఊరూరా వాటిని ప్రదర్శించారు. వాడవాడలా వాటిని ఆలపించారు. 
అయితే పాట నిశ్చల కాదు….
 పాట నిష్క్రియ కాదు…. 
పాట సోమరి కాదు…. 
పాట పిరికిది కాదు…! , 
     అందుకే, పాటతో చేయి కలిపిన ప్రతి గాలీ పిడికిలి బిగించింది!, 
పాటతో పాటు అల్లుకుపోయిన ప్రతి చెట్టూ నిటారుగా నిలబడింది. 
పాటతో ప్రవహించిన నది ఉప్పెనై ఎగిసింది. 
పాటతో మమేకమైన మట్టి యుద్ధాన్ని మొదలెట్టింది. 
పాటతో పునీతమైన ఆకాశం ఉరుములుమెరుపులై గర్జించింది. 
పాటతో సంలీనమైన అగ్ని, జ్వాలలై రగిలింది.
ఇది నిజం! ఇదే సత్యం!! అని చెప్పడానికి చరిత్రలో ఎన్నెన్నో ఉదంతాలు ఉన్నాయి. భారత స్వాతంత్య్ర సమరం దానికి నిజమైన తార్కాణం! 
తెలంగాణ ప్రత్యేక రాష్ర్ట ఉద్యమం దానికి సత్యమైన దష్టాంతం!!

ప్రపంచ దేశాలు -ప్రజా గీతాలు:
         ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఖండాలలోని దేశాలన్నీ ప్రాచీన జానపద జీవన విధానాన్ని, ప్రజా పోరాట నేపథ్యాన్ని కలిగి ఉన్నవే. అణిచివేతకు, దోపిడీకి, పరాయి పాలనలో వివక్షకు గురై కునారిల్లిన సమాజాలే! అందుకే ఆఫ్రికాలో, దక్షిణ అమెరికా దేశాలలో బలమైన ప్రజా పోరాటాలు, ఉద్యమాలు జరిగాయి. ఆ సందర్భంలో ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ఆయా దేశాల సామాన్య ప్రజల వ్యవహార భాషలో, వాడుక పదాలతో వేలాది పాటలు ప్రాణం పోసుకున్నాయి. ఆఖరికి ఆధిపత్యానికి కేరాఫ్ అడ్రస్‌గా ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేసిన అమెరికా, ఇంగ్లండ్‌లలో కూడా ప్రజా గీతాలు, జానపద పాటలు ప్రచారంలోకి వచ్చాయి. అలాంటి వాటిలో జిలాన్ థామస్ రాసిన గీతాలు, పీట్ సీగర్స్, బాబ్ డిలాన్ పాటలు ప్రముఖంగా ప్రస్తావించదగినవి. అమెరికాలో ఆదిమ జాతుల హక్కుల గురించి గొంతెత్తిన పీట్ సీగర్స్ (19192014) వెస్టర్న్ కల్చర్‌లో మునిగితేలుతున్న సమాజానికి, తాను చనిపోయేంత వరకూ జానపద పాటలనే పాడి వినిపించాడు. ఆయన రాసిన ‘we shall overcome’ అనే పాట ప్రపంచ భాషలన్నింటిలోకి అనువాదమైంది. ఆఖరుకు హిందీలో కూడా ‘హవ్‌ు ెంగే కావ్‌ు యాబ్ ఏక్ దిన్’ అనే పాటగా 1970 దశకంలో ఆత్మవిశ్వాసానికి సంకేత గీతంగా ప్రజాదరణ సాధించింది.
అలాగే, జానపద భాషను, బాణీలను తన స్వరాలకు ఆధారంగా మలుచుకున్న బాబ్ డిలాన్‌కు 2016 సంవత్సరపు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది. ఈ ఉదాహరణలు ప్రపంచ స్థాయిలో ప్రజా గీతాలకు జానపద పాటలకు నేటికీ ఆదరణ ఉందనే విషయాన్ని మరోసారి రుజువు చేసేవే!

పాటలు వర్గీకరణ:
      మనసులోని భావాలను అర్థవంతమైన వాక్యాలుగా మార్చి వాటికి లయను, రాగాన్ని, సంగీతాన్ని జోడించి ఆలపించేదే “పాట”! అంటే పాటలో సాహిత్యం సంగీతం రెండూ దేహం ప్రాణంలాగా కలిసి ఉంటాయి. కాగా సందర్భం, నేపధ్యం, వస్తువు పాటలోని సాహిత్య తీరు తెన్నులకు, సంగీతంలోని స్వరాలకు ప్రాతిపదికగా నిలుస్తాయి. సాహిత్య సంగీతాలను నిర్ధారించేవి, నిర్ణయించేవి కూడా అవే.      
       కాగా ‘పాట’ను స్థూలంగా ఆయా పాటల వస్తువు, మాధ్యమాల ఆధారంగా ఈ క్రింది విధంగా వర్గీకరించవచ్చు :
1. శాస్త్రీయ బాణీ పాటలు /
 2. సినిమా సంగీతం పాటలు / 
3. సంప్రదాయ జానపద పాటలు
ఎ. పొలం పనుల పాటలు / 
బి. పెళ్ళి పాటలు, బారసాల పాటలు
సి. పండుగల పాటలు /
 డి. పల్లె పాటలు
ఇ. ఉయ్యాల పాటలు, తుమ్మెద పాటలు, జాజిరి పాటలు మొ॥

4. సమకాలీన జానపద పాటలు:
ఎ. పుణ్యక్షేత్రాల / దేవాలయాల పాటలు / 
బి.పండుగల పాటలు
సి. ఉద్యమ పాటలు / 
డి. రాజకీయ పాటలు / 
ఇ. సామాజిక చైతన్య పాటలు / 
ఎఫ్. ప్రభుత్వ పథకాల సంక్షేమ పాటలు / 
జి. జానపద భక్తి పాటలు / 
హెచ్. ప్రత్యేక సందర్భాల పాటలు (రాష్ట్ర అవతరణ ఉత్సవం, ప్రముఖుల జన్మదినోత్సవం, జయంతి, నివాళి, స్మృతి పాటలు)

శాస్త్రీయ బాణీ పాటలు:
       పాటల పరిణామ క్రమంలో తొలిపాదం జానపదానిదే! ఆ తర్వాతే పాట పాండిత్యాన్ని, శాస్త్రీయతను సంతరించుకుని శాస్త్రీయ సంగీతంగా వినుతికెక్కింది. ఉత్తర భారతీయ శాస్త్రీయ బాణీలన్నీ ‘హిందుస్థానీ సంగీతం’ గానూ, దక్షణ భారతీయ శాస్త్రీయ బాణీలన్నీ ‘కర్నాటక సంగీతం’గా పేరొందాయి. ఆయా సంగీత స్వరాలు, రాగాలు, రీతులలో లిఖిత రూపంలో సమకూర్చిన పాటలే ‘శాస్త్రీయ గీతాలు’గా ఆదరణ పొందాయి. కర్నాటక సంగీతత్రయం ముత్తుస్వామి దీక్షితార్, త్యాగరాజస్వామి, శ్యామశాస్త్రి, పురందరదాసు, క్షేత్రయ్య, అన్నమాచార్య, రామదాసు, స్వాతి తిరునాళ్ మొదలగు వారు రాసిన కీర్తనలు, జావళీలు, పదాలు ఈ కోవలోనివి. అలాగే రాకమచర్ల, హనుమద్దాసు, దున్న ఇద్దాసు వంటి వారు రాసిన భజన కీర్తనలు కూడా ఈ సంప్రదాయానివే!

సినిమా సంగీతం- పాటలు:
        1913లో మన దేశంలో సినిమా నిర్మాణం దాదాసాహెబ్ ఫాల్కే కృషితో ప్రారంభమై, ఆ తర్వాత 1931లో ‘ఆలం అరా’తో టాకీ సినిమాలు మొదలైన తర్వాత సినిమా సంగీత గీతాలు వాడుకలోకి వచ్చాయి. తెలుగులో అదే సంవత్సరం విడుదలైన ‘భక్త ప్రహ్లాద’ సినిమాతో సినీ పాటల ప్రస్థానం ప్రారంభం అయింది. తెలంగాణ ప్రాంత కవి చందాల కేశవదాసు ఈ సినిమాలో పాటలు రాసి తొలి తెలుగు సినీ గీత రచయితగా కీర్తి సంపాదించినారు. అప్పట్నించీ ఇప్పటి వరకూ తెలుగు సినీ రంగం 89 ఏళ్ళ కాలంలో దాదాపు 40 వేలకు పైగా పాటలను సృష్టించింది. క్రమంగా జనసామాన్యంలో అంతకు ముందున్న జానపద గీతాలు, శాస్త్రీయ కీర్తనల కన్నా సినీ పాటలు బహుళ ప్రజాదరణను సాధించి, పాటలు అంటే సినిమా పాటలే అనేంతగా ముద్ర వేసాయి. మరో వైపున ప్రజలలో వాడుకలో ఉండి అత్యంత ఆదరణ పొందిన జానపద పాటలు కూడా, ఆ తర్వాత సినిమా గీతాలుగా కొన్ని మార్పులతో మళ్ళీ వాడుకలోకి వచ్చాయి.

సంప్రదాయ జానపద పాటలు:
తెలుగులో సినిమా పాటలకు వందేళ్ళ లోపు చరిత్ర మాత్రమే ఉంది. శాస్త్రీయ పాటలకు దాదాపు 6,7 శతాబ్దాల చరిత్ర మాత్రమే ఉంది. కానీ జానపదాలకు వేలాది సంవత్సరాల చరిత్ర ఉంది. మానవ జీవన అనుభవాల సారమంతా జానపదంగా ‘శ్రుత సంప్రదాయం’లో ఒక తరం నుంచి మరో తరానికి మౌఖికంగా అందించబడి, పరంపరానుగతంగా ప్రజల నిత్య జీవన వ్యవహారంలో అంతర్భాగంగా కొనసాగుతున్నాయి. ఇలాంటి సంప్రదాయ జానపద పాటలు వ్యవసాయం పంటలు, పెళ్ళిల్లు, కుటుంబ వేడుకలు, ఆయా పండుగల సందర్భాను సారంగా వచ్చే పాటలుగా బహుముఖాలుగా విస్తరించాయి. పనిలో ఉన్నపుడు శ్రమ తెలియకుండా ఉండటానికి, వేడుకల సందర్భంలో సంబరాన్ని ద్విగుణీకృతం చేయడానికి ఈ పాటలు ఉపకరించాయి.

సమకాలీన జానపద పాటలు:
సగటు ప్రజలలోకి, సామాన్య నిరక్షర జనంలోకి ప్రభావమానంగా, వేగంగా తీసుకు వెళ్ళగలిగే బాణీలు జానపద బాణీలే! ప్రజల భాషలో, ప్రజలకు అర్థమయ్యే రీతిలో, స్థానిక ప్రతీకలు సామెతలు పలుకుబడులతో కూడి ఉన్న ఈ పాటలు ప్రజాభిమానాన్ని సంపాదించినాయి. అందుకే ఆయా సందర్భాలలో వివిధ సంస్థలు, సమాజాలు, ప్రభుత్వాలు, వ్యక్తులు సమకాలీన అవసరాలు ఆశయాలకు అనుగుణంగా జానపద పాటలను రూపొందించి ప్రచారం చేసాయి. చేస్తున్నాయి.

సమకాలీన జానపద పాటల పరిణామం -తెలంగాణ:
         తెలంగాణలో సమకాలీన జానపద పాటల తీరు తెన్నులను గమనిస్తే ఆశ్చర్య పోకుండా ఉండలేము. తెలంగాణ సమాజం మొదటి నుండీ ప్రజా కళలకు, ప్రజా కళా రూపాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలవడమే కాక, వాటిని అంతరించిపోకుండా కాపాడుకోవడంలో, పరిరక్షించుకోవడంలో కూడా అంతే పాత్రను పోషించింది. ఎన్ని ఆధునిక, నవీన రీతులు, పాశ్యాత్య సంగీతాలు, సినీ సంగీతం వంటివి ఎన్ని వచ్చినా జానపద గీతాల్ని వదులుకోలేదు.
అందుకే తెలంగాణలో సమకాలీన యుగంలో ముఖ్యంగా 1948 సాయుధ రైతాంగ పోరాటం సమయంలో పాట ఆయుధమై మెరిసింది. దోపిడీకి, అణిచివేతకు, వ్యతిరేకంగా ప్రజలలో గొప్ప తిరుగుబాటకు ప్రేరకమై నిలిచింది. అలాగే 1980 దశకంలో నక్సల్బరీ ఉద్యమ సమయంలో పాట జన జీవన నాడిగా గెలిచింది.
       ఇక, 2000వ సంవత్సరం నుండి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర మలిదశ ఉద్యమ సమయంలో జానపద పాట కొత్త చైతన్యపు చిగుళ్ళతో పల్లవించింది. తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి పతాకమై ఎగిరింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ భావనను, ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు, వివరించి, జాగృత పరిచి వారిలో ఏకత్వ స్ఫూర్తిని, పోరాట దీప్తిని వెలిగించింది. ఇక రసమయి బాలకిషన్ గారి ‘ధూంధాం’, ఇతర ప్రజా కళా సంఘాలు కూడా తోడై జానపద పాటకు శిఖరాగ్రస్థాయిని తీసుకొచ్చాయి. 
        ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఉన్న జానపద గాయకులు, రచయితలు,సంగీతకారులు తమదైన శైలిలో ఆయా స్థానిక దేవాలయాల మహాత్మాల్ని వర్ణించే పాటలను, జానపద భక్తి పాటలను విస్తృతంగా సృజించినారు. ఉదా. యాదాద్రి, వేములవాడ, భద్రకాళి ఆలయాల మహిమలను, క్షేత్ర విశేషాలను వివరించే పాటలు.
        అలాగే పండుగల సందర్భంలో ప్రత్యేక జానపద పాటలను కూడా సృష్టించారు. బోనాలు, బతుకమ్మ, వినాయకచవితి, దసరా, హోలీ వంటి పండుగల సందర్భంలో వచ్చిన జానపద పాటలు. ఈ పాటలు మొదట్లో వేదిక మీద, ఆ తర్వాత ఆడియో క్యాసెట్ల రూపంలో, ఆ తర్వాత సీడీలుగా, ప్రస్తుతం వీడియోలుగా, విజువల్ సాంగ్స్‌గా అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా రూపాంతరం చెందుతూ వచ్చాయి. ఇవే కాక సమాజంలో ఉండే దురాచారాలు వరకట్నం, మద్యపానం, నిరక్షరాస్యత, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు మొదలగు అంశాల పట్ల సరైన అవగాహన కోసం సామాజిక చైతన్య పాటలు జానపద శైలిలోనే విస్తృతంగా సృష్టించబడ్డాయి. అలాగే, ఎన్నికల సందర్భంలో ఆయా రాజకీయ పార్టీల ప్రచార అస్త్రాలుగా కూడా ఈ జానపద పాటలు పుట్టుకువచ్చాయి. ఇక, ప్రభుత్వం కూడా ఆయా ప్రజాప్రాధమ్యాలను అనుసరించి తమ పథకాలను ప్రచారం చేయడానికి, అవగాహన కల్పించడానికి, ఆయా సంక్షేమ పథకాల వినియోగానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అందించడానికి జానపద పాటలనే ఆశ్రయించింది. ఈ పంథా ఆయా కాలాలలో, వేర్వేరు సందర్భాలలో సత్ఫలితాలను కూడా ఇచ్చిం ది. ఇలా జానపద పాటలు ఎంత ప్రాచీనతను, చరిత్రను కలిగి ఉన్నామో, అంతకన్నా ఎక్కువ సామాజిక ప్రయోజనాన్ని కలిగి ఉండి, సామాన్య మానవుడికి ఇరుపక్కలా నిలబడి, నిరంతరం అతడ్ని జాగృతం చేసాయి.
తెలంగాణ సాంస్కృతిక సారథి
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కూడా జానపద పాట ప్రజలం దరిలో గొప్ప చైతన్యాన్ని తీసుకువచ్చింది. అదే చైతన్యాన్ని ఉద్యమానంతరం కూడా కొనసాగించాలనే లక్ష్యంతో ఒక విభిన్న, వినూత్న సంస్థను “సాంస్కృతిక సారధి” పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 
       పాటనే ఇంటిపేరుగా మార్చుకుని, పాటనే తమ కలల నిండా, తమ గళాలు పొంగగా పరవశించి, పరిమళించి పాడే ‘పాటన్న’లను, ‘పాటక్క’లను గౌరవించుకోవాలి అని తెలంగాణా ప్రభుత్వం భావించింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి మానస పుత్రికగా ప్రజా పాటకు పట్టాభిషేకం చేసేలా “తెలంగాణ సాంస్కతిక సారధి” జీవో ఎం.ఎస్. నెం. 6 ద్వారా 27112014 నాడు ఆవిర్భవించింది. 5 డిసెంబర్ 2014 నాడు శ్రీ రసమయి బాలకిషన్ గారిని సాంస్కృతిక సారథి అధ్యక్షులుగా ప్రభుత్వం నియమించింది. 550 మంది కళాకారులు అధికారికంగా 1-1-2015 నుండి బాధ్యతలు స్వీకరించారు.
             నిజానికి తెలంగాణ రాష్ర్ట అవతరణ ప్రజలందరికీ ఎలాంటి ఉద్విగ్న భరిత ఘట్టమో, ‘తెలంగాణ సాంస్కతిక సారథి’ ఏర్పాటు కూడా కళాకారులం దరికీ అంతే అత్మీయ సందర్భం. ఉద్యమకాలంలో తెలంగాణ ప్రజల కోసం, ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష కోసం నిరంతరం తపించి పదాలకు పాదాలను, పాటలకు గళాలను అంకితం చేసిన కళాకారులకు నీరాజనంగా తెలంగాణ సాంస్కతిక సారథి అవతరించింది. ఉద్యమకాలంలో పాట ద్వారా ఏవిధంగానైతే ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చారో, అదే పంథాలో రాష్ర్ట పునర్నిర్మాణ క్రమంలో కూడా ప్రజలలో అంతే జాగృతిని తీసుకురావాలనే సదాశయంతో తెలంగాణ సాంస్కతిక సారధి వ్యవస్థ ఏర్పాటైంది. గత ఐదు సంవత్సరాలుగా తెలంగాణ సాంస్కతిక సారధి కళాకారులు ప్రభుత్వ అభివద్ధి, సంక్షేమ, వికాస, విజ్ఞాన అవగాహన కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు స్పం దించి వందలాది గీతాలను రాసి, రాగాలను కూర్చి, పాడారు… ఊరూరా తిరిగా రు… తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతర కాలంలో తెలుగులో సినిమా యేతర సంగీత గీత సాహిత్య సృష్టిలో అత్యధిక సంఖ్యాక పాటలను సృష్టించిన ఏకైక సంస్థ తెలంగాణ సాంస్కృతిక సారధి అని చెప్పాలి. వివిధ అంశాలపై దాదాపు 1000కి పైగా పాటలను సాంస్కృతిక సారధి లోని కవులు, గాయకులు, సంగీత కా రులు కలిసి రచించి గానం చేసి స్వరాలు సమకూర్చారు. ఆ లెక్కన అతిపెద్ద పాటల సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసిన సంస్థ తెలంగాణ సాంస్కృతిక సారధి. 
        కాగా, తెలంగాణ సాంస్కృతిక సారధి ఈ గీతాల సాఫ్ట్‌వేర్‌ను ప్రధానంగా రెండు రూపాలలో అందించింది.
1. సీడీల రూపంలో : 
వివిధ ప్రభుత్వ పథకాలు, సందర్భాలను అనుసరించి ప్రత్యేక గీతాలను రచించి సంగీత స్వరాలను సమకూర్చి వాటిని రికార్డు చేసి సీడీల రూపంలో పూర్తిస్థాయిలో గీతాలుగా అందించింది. గీతాలకు శాశ్వత రికార్డును, డాక్యుమెంట్‌ను చేసింది. వాటిలో కొన్ని
1. బతుకమ్మ పాటలు 2015 /
 2. బతుకమ్మ పాటలు 2016 / 
3. గోదావరి పుష్కరాలు భక్తి గీతాలు / 4. చైతన్య గీతాలు ఆరోగ్య కుటుంబ సంక్షేమం
5. ప్రజాసంక్షేమ పథకాలు చైతన్య గీతాలు 2017 / 
6. మిషన్ కాకతీయ
7. తెలంగాణకు హరితహారం / 
8. స్వచ్ఛ హైదరాబాద్

2. ప్రచారంలో భాగంగా పాడే గీతాలు: ఆయా సందర్భాన్ని, ప్రభుత్వ ప్రాధాన్యతలను అనుసరించి తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు రాసి వివిధ వేదికల మీద గ్రామ గ్రామాన పాడిన పాటలు ఇవి. వేలాదిగా ఉన్న ఇలాంటి గీతాలలో కొన్నింటిని సమీకరించి పుస్తక రూపాన్ని ఇవ్వడం ద్వారా ఆ పాటలకు శాశ్వతత్వాన్నివ్వగలుగుతాము అని భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ సాంస్కృతిక సారధి భావించింది.

3. డిజిటలైజ్ చేయడం :           అందుబాటులోకి వచ్చిన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగిస్తూ తెలంగాణ సాంస్కృతిక సారథి కార్యకలాపాలను డిజిటలైజ్ చేయడం జరిగింది. దీనికోసం 
ఎ) www.tssts.org పేరిట ప్రత్యేక వెబ్ సైట్‌ను ఏర్పాటు చేసాం. 
బి) తెలంగాణ సాంస్కృతిక సారధి పేరిట ప్రత్యేక యూట్యూబ్ చానెల్‌ను ఏర్పాటు చేసి, అందులో సాంస్కృతిక సారథి కార్యకలాపాలను, పాటలు, ఆడియో సాంగ్స్, వీడియో సాంగ్స్‌ను అప్‌లోడ్ చేయడం ద్వారా అందరికి అందుబాటులోకి తెచ్చాం. 
సి) సోషల్ మీడియాలో ఫేస్‌బుక్ ద్వారా సాంస్కృతిక సారథి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ డిజిటల్ యువతకు కూడా దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నాం.

పుస్తక రూపం
           ఇలా, ప్రజా సాహితీ క్షేత్రంలో వందలాది పాటలను సాంస్కృతిక సారధి కళాకారులు సష్టించారు. ప్రజల మస్తిష్కాలలో ఆలోచనను రేకెత్తించారు. అలాంటి పాటలను ఏరి కూర్చి పుస్తకాలుగా ముద్రించడం ద్వారా ఆయా సందర్భానికి తగిన పాటలకు శాశ్వతత్వం, డాక్యుమెంటేషన్ జరుగుతుందని భావించడం జరిగింది. ఆ ఆలోచనలోంచే మొదటిసారి వందలాది పాటలలోంచి కొన్ని పాటలను ఎంపిక చేసి జూన్ 2017లో “బంగారు తెలంగాణ బాటలో…” పేరుతో ఒక పాట సంకలనాన్ని సాంస్కతిక సారథి ప్రచురించింది. ఇందులో మొత్తం 154 పాటలను (హరితహారం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, అవతరణ దినోత్సవం, వివిధ సంక్షేమ పథకాలు, స్వచ్ఛ హైదరాబాద్, గుడుంబా నిషేధం, అవినీతి అంతం, నగదు రహితం, మహిళాశక్తి, గ్రామజ్యోతి, అమరుల యాది లాంటి ప్రాధాన్య అంశాలపై) సంకలనం చేసాము. 
            ఇప్పుడు మళ్లీ ఈ రెండున్నరేళ్ళ కాలంలో (జూలై 2017 నుండి డిసెంబర్ 2019 వరకు) సాంస్కృతిక సారధి సృష్టించిన వేలాది పాటలలోంచి ఎంపిక చేసిన 505 పాటలతో “సంక్షేమ స్వరాలు” పేరుతో మరో పుస్తకాన్ని మీ ముందుకు తెస్తుంది. ‘సంక్షేమ స్వరాలు’ తెలుగు గేయ / పాట సాహిత్య చరిత్రలోనేకాక, అన్ని ఇతర భారతీయ భాషలలోకెల్లా అతిపెద్ద సంకలనంగా భావిస్తున్నాను. ఆ మేరకు ఇది పాటల ప్రస్థానంలో ‘బృహత్ సంకలనం’ అనడంలో సందేహం లేదు. 505 పాటల సంకలనంగా రూపొందించిన ఈ గీతాల మహాసంకలనంలో.. రైతు బంధు, హరిత హారం, స్వచ్ఛ తెలంగాణ, మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ, బడి బాట, మున్సిపల్ చట్టం, కంటి వెలుగు, రాష్ర్ట అవతరణ, కాళేశ్వర, సంక్షేమ తెలంగాణ వంటి ఎన్నెన్నో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల మీద, సమయోచితమైన చైతన్యాన్ని, అవగాహనను కలిగించే పాటలు రచించి గానం చేయడం విశేషం అని చెప్పాలి. ఈ పుస్తకం, ఉద్యమానంతర తెలంగాణ రాష్ర్ట ప్రగతి తీరుతెన్నులను, వివిధ అభివద్ధి సంక్షేమ పథకాల గురించిన సమాచారాన్ని విశేషాలను ప్రజలను ఆకట్టుకునే జానపదరీతిలో పాటల గుచ్ఛంగా రూపొందించింది.
తెలంగాణ సాంస్కృతిక సారధి 2015 నుండి 2019 వరకు గొప్ప పాటల సాఫ్ట్‌వేర్‌ను సృజనాత్మకంగా సృష్టించిదనే మాటకు, ఈ ‘సంక్షేమ స్వరాలు’ సంకలనం ‘పాటెత్తు’ నీరాజనంగా నిలిచిందనడంలో సందేహం లేదు. సాంస్కృతిక సారధి కళాకారులు సృష్టించిన వేలాది పాటలలో ఏరిన ముత్యాల వంటి పాటలను ఒక్క చోట చేర్చి ‘పాటల హారాన్ని’ అందిస్తున్నందుకు సంతోషిస్తున్నాము.
ఇలా తెలంగాణ సాంస్కతిక సారధిని స్థాపించడమే కాకుండా, నిరంతరం మాకందరికీ స్ఫూర్తి ప్రదాతగా ఉన్న మాన్య ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
         సంస్కతి పట్ల అభిమానాన్ని, కళల పట్ల ఆదరణను కలిగి, మార్గదర్శిగా మమ్మల్ని నడిపిస్తున్న మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారికి, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి ఐఎఎస్(రి) గారికి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శ్రీ సి. పార్ధసారధి ఐఎఎస్ గారికి, ప్రభుత్వ కార్యదర్శి శ్రీ బుర్ర వెంకటేశం ఐఎఎస్ గారికి ప్రత్యేక కతజ్ఞతలు. 
తెలంగాణ సాంస్కతిక సారధి కళాకారులకు, రచయితలకు, గాయకులకు ఈ పుస్తక ప్రచురణలో సహకరించిన అందరికీ వందనాలు తెలియజేస్తూ…                                                                                                                                        ----మామిడి హరికృష్ణ

Sunday, 7 June 2020

ఊరికి పోయిన యాళ్ళ...


ఊపిరి పువ్వు!

ఊపిరి పువ్వు!
---- మామిడి హరికృష్ణ 8008005231

ఒక పాదం- 
మహా తపస్వి జ్ఞాన దీపాన్ని చిదిమేస్తుంది 
అస్తిత్వ సూర్యుణ్ణి పాతాళంలోకి తొక్కేస్తుంది 
నల్ల మందార పువ్వు ఊపిరిని నలిపేస్తుంది !

ఇంకొక పాదం-
ఆడబిడ్డ జాడ కోసం సముద్రాలను లంఘిస్తుంది 
హిమవన్నగ సౌందర్యంలోకి వాయు వేగంతో తేలిపోతుంది 
వేలాది ఏళ్ళ చంద్రుడి కవ్వింపుకి సమాధానం చెప్తుంది
ఊపిరి జెండాను ఎగరేయడానికి ఊరికి నడిపిస్తుంది  !

మొదటి పాదం-
దుర్వాసుడు, బలి, George Floyd లను 
యుగాల నుండి వెంటాడి వేటాడి 
పునః పునః చంపేస్తుంది.. 
I can't Breathe.... ! 1

రెండో పాదం-
హనుమంతుడు, ప్రవరుడు, 
Neil Armstrong, వలస కూలీ నారాయణలను
స్థల కాలాలకు అతీతంగా వెతికి వెతికి 
మళ్ళీ మళ్ళీ బతికిస్తుంది...
It's a Giant leap for mankind....!! 2

ఇప్పుడు నా పాదానికి 
మహిమలు- మాయలు- మర్మాలు తెలియని 
రంగు రుచి వాసన అసలే లేని లోకం కావాలి 
ఊపిరి పువ్వుకు - ఊరి నవ్వుకు దారి చూపే కాలం రావాలి
 as the sound of the marching feet of a determined people...!!! 3

*************************************************

1--- George Floyd చివరి మాటలు! 
2--- చంద్రుని పై కాలు మోపినప్పుడు Neil Armstrong రేడియో సందేశం లోని వాక్యాలు !!
3--- నల్ల జాతి హక్కుల యోధుడు Martin Luther King ప్రసంగం లోని నిప్పు కణికలు!!!

అవని పై హరితాక్షరాలు


మానవ సంవేదనా శకలం



నంది అవార్డులు


Preserving the moving heritage


యువత రంగ స్థలం


సౌందర్యం జన్మ రహస్యం ..


ఆశ్రిత వర్గాల కథన కళా రూపాలు


పుస్తకోgraphy!

Shubhodayam folks..I am a human being carved out by books..Here, it's my tribute to books in FUSION SHAYAREE style...
పుస్తకోgraphy!

1. మానవుని అన్వేషణకి, జ్ఞాన గవేషణకి, ధ్యాన విశ్లేషణకి, స్వీయ ఆవిష్కరణకి ఆలంబన ఎక్కడ ఉంది? సహస్రాబ్దాల కాలం నుండి మనిషి మేధో గదిలో  వ్రేళ్ళాడుతున్న ప్రశ్న ఇది. నవాబు లాంటి జవాబు ఒక్కటే--- That is అనుభవం! 
షాయద్, Experience is the source of knowledge! Resource of the Human pledge!!

2.తరతరాల experiments ఎన్నో కలిసి Collective Experiencesగా, Selective Memoriesగా, Reflective Impressionsగా, Elective Expressionsగా cumulative రాశిగా మారిందే సత్యం! అనుభవం ముదిరి జ్ఞానంగా, జ్ఞానం చెదిరి తత్వంగా, తత్వం కుదిరి జీవితంగా metamorphosis చెందాక.....
Yes, జీవిత వర్ణమాలలో తొలి అక్షరం--- అనుభవం! హృదయ స్మృతిపేటికలో అనుభవం చెక్కిన వాక్యం--- విజ్ఞానం!!  

3.    ఆది దినముల యందు అనుభవమే ఉండెను! మదితో, సమ్మతితో, సమూహ గతితో, సమ్మోహన శ్రుతితో, సంకుల సమర స్మృతితో, సంకేత, సంజాత, సంజ్ఞా ప్రతీకలలోకి దిగిపోయి, ఒదిగిపోయి అక్షరంగా ఒరిగిపోయెను. అక్షరం - భాషగా, భాష - రచనగా, రచన - కావ్యంగా,గీతంగా, సుతారంగా పుస్తకమాయెను. 
Of course, అనుభవం = జిందగీ = పుస్తకం = consciousness! పుస్తకం is the Record of the Collective Sub-Consciousness!!

4.   Fear, Fantasy, Imagination, Invention, Innovation, Introspection, Experimentation, Experience, Verification, Comparison ల అనంతరపు filter కాఫీ రూపం - పుస్తకాధ్యయనం! Word and Meaning అనే వాగర్థాల Chaptersలోని లోయల్లోకి బంగీజంప్ చేశాక...వాగర్ఠావివ సంపృక్తవ్ వాగర్థ ప్రతిపత్తయే శ్లోకాన్ని ఆలోచించి, అవలోకించి, అవధరించాక ....  
  Indeed, అక్షరం - ఆపాతమధురం! అధ్యయనం -ఆలోచనామృతం! 

5.    ‘నీలే నీలే అంబర్ పర్ చాంద్ జబ్ ఆయే’ గతాలు, సాగర్ కినారే గీతాలు, బసంత్ బహార్ రాగాలు,  మేఘ మల్హర్ స్వరాలు, Greek sophists వర్గీకరించిన జ్ఞాన శకలాలు, ఆశల అంతరిక్షాలు, ఆకాంక్షల ఆకాశాలు, దుఃఖ  సముద్రాలు, ద్వంద్వ సంఘర్షణలు, స్వేద భూములు, స్వేఛ్ఛా భువనాలు, స్వార్థ భవనాలు, ఆవేశపు అగ్నిజ్వాలలు, ఆవేదనపు అణుకీలలు, నిర్లిప్త వాయుకీర్తనలు, ఉత్తేజిత మయూర నర్తనాలు, Geography, Polity, Economy, History వర్ణనలు, Physics, Chemistry, Botany, Zoology, Astronomy, IT, Medicine వివరణలు, పియానో, వేణువు, వయోలిన్, వీణ notations,   తబలా, మృదంగం, డప్పు, డోలు beats... అన్నిటిని మరుగుజ్జులా, Lilliput లా downsize చేసిన Magic Wand - పుస్తకం!
  జీహా, పుస్తకం - outer లోకాన్ని దర్శించే  గవాక్షం! Inner లోకాన్ని స్పర్శించే  అక్షం!!

6. కితాబ్ ! ఆదాబ్ లను, బేతాబ్ లను, మతాబులను, మతలబులను ఒక వైపు, "మై తేరే లియే హీ సాత్ రంగ్ కె సప్నే చునే" లేపనాలను , చీమలు పెట్టిన పుట్టలో పుటలు, పుటలుగా అందించే ప్యారా మెహబూబ్!
అవును, బుక్ is బ్రహ్మ విష్ణు మహేశ్వర సారం-- సృష్టి స్థితి లయ కారకం! లక్ష్మీ పార్వతీ సరస్వతీ రూపం--- ధన ధైర్య విద్యా ప్రేరకం!!

-------- మామిడి హరికృష్ణ 8008005231

సకల కళల ఖజానా - తెలంగాణా !


ప్రకృతే కవిత్వానికి ప్రేరణ



FUSION SHAYAREE



అశ్రు గీతం




Monday, 1 June 2020

ప్రకృతి ...పంచభూతాలు... ఓ ప్రయాణం ...!

Here, it's my poem PRAKRUTHI.. PANCHA BHOOTALU.. O PRAYANAM!!, published in NAVA TELANGANA news paper on 1-6-2020..Plz read..
ప్రకృతి ...పంచభూతాలు... ఓ ప్రయాణం ...!
---- మామిడి హరికృష్ణ 8008005231

1. అర్ధాంతరంగా అనాలోచితంగా ప్రయాణం మొదలెడతాను 
దిక్కులు తెలీదు – దిక్సూచీ లేదు
వెలుతున్నది సాగరంలోకి – అరణ్యానికి –
ఎడారికి – మంచులోయలోకి
మరే భౌగోళిక ఖండాంతరంలోకో అంతకన్నా తెలీదు 
తెలిసిందల్లా ఒక్కటే 
ఈ గమనం ప్రకృతిలోనికే అనీ.. ప్రేమలోకే అనీ.. !

2. అలలు అలలుగా ఒకసారి- తాటిచెట్టు ఎత్తులో మరోసారి 
సాగరంలో కెరటాలు ఎగిసిపడతాయి 
తడిసిపోతాను ....మునిగిపోతాను.... తేలిపోతాను...
ఈదులాడతాను... ఎదురువెళతాను...ఎగసి దూకుతాను
ఆల్చిప్పలను, ముత్యాలను అన్వేషిస్తూ 
సముద్రపు లోతుల్లోకి దూసుకెళతాను! 

3. గడ్డిపూవులా నేలబారుగా ఒకసారి
ఆకాశంలోకి తలను చొప్పించి మహావృక్షంగా మరోసారి
నేల అంతా సమాంతరంగా నిలువుగా విస్తరించిన వనం 
అడవంతా పరుచుకున్న లతలు, వృక్షశాఖలు
కిరణాలను సైతం నేలను చుంబించనీయని చిక్కని ఆకులు 
అష్ట దిశలా  
పత్రహరితాలు – పూలు – కాయలు – పండ్లు
హరిణాలు – నెమల్లు – కుందేళ్ళు – కోయిలలు!
పల్లవిస్తాను.. పరవశిస్తాను ...పరిమళిస్తాను...
పలవరిస్తాను.. పడిపోతాను... పరుగెత్తుతాను...
ఒత్తిగిలి మత్తుగా పడుకుంటాను..
నా పాట నేనే నాలో కొత్తగా పాడుకుంటాను!
ఆకుపచ్చని లోకాన్ని –
అరణ్య గంభీర సౌందర్యాన్నివెదుక్కుంటూ 
చెట్టు తొర్రల లోలోపలి పొరల్లోకి పొర్లుతాను! 

4. రేణువులు రేణువులుగా విస్తరించిన ఇసుక 
దిబ్బలు దిబ్బలుగా పేరుకుని
నేల అంతటా మట్టి రంగు అలికినట్లు 
కంటికి ఆనేంత దాకా వ్యాపించిన ఎడారి 
పాదా పాదానా కూరుకుపోయే అడుగులు 
నిట్టనిలువు ఎండజాడలలో కరిగిపోయే మడుగులు 
అర్థరాత్రి వెన్నెలలో చల్లబడే మనసులు 
చిందరవందర ఔతాను...చంచలిస్తాను..
చమటలు కారతాను.. చిచ్చర పిడుగునై రెచ్చిపోతాను..
చంద్రున్ని వెదికి పట్టుకొని
పెదాలతో చుంబించి చాపంలా మెరుస్తాను..! 

5. ఇంటికప్పులపై – దేవదారు వృక్షాలపై – పర్వతాలపై 
లోయ అంతటా దూదికుప్పలు పోసినట్లుగా మంచు 
నది కూడా ఘనీభవించి ప్రవాహ ధర్మాన్ని మర్చిపోయేలా చేసి  
లోకాన్నంతా ధవళ వర్ణాలతో ముంచేసి 
రక్త కణాలను సైతం గడ్డ కట్టించే శీతల హిమసమూహం! 
నిశ్చలుణ్ణి అవుతాను ... నిర్విణ్ణున్ని అవుతాను.. 
నిబ్బరపడతాను... నిర్లిప్తుణ్ణి అవుతాను
నిగిడిపోతాను...నిగారింపు తేలుతాను !

6. నా వెంట ఏవీ తెచ్చుకోలేదు -
వాహనం – నావ – ఒంటె – స్లెడ్జ్
తలపైకి హ్యాట్ – డైవింగ్ సూట్ – హార్డ్ షూస్ – స్వెటర్ ఏవీ లేవు 
నాతో ఏవీ అమర్చుకోలేదు-
ఆయుధాలూ -ఆసరా- ఆర్భాటం- అనుచర వర్గం ఏవీ లేవు 
ఉన్నదల్లా నేను.... నా మేను మాత్రమే...!
అగ్ని విశ్వాసం – జల సంకల్పం 
వాయుగమనం – ధాత్రీ సహనం
ఆకాశ లక్ష్యం మాత్రమే ...!

7. వాలిన దిక్కుకి ఇటు ఒడ్డున
ఇప్పుడు అర్థమయిందల్లా ఒక్కటే --
ఈ ప్రస్థానం పంచభూతాలలోనికే అనీ..
ప్రణయంలోనికే అనీ ... !!

TELANGANA_CINEMA_TO_GO_ON_MARATHI_WAY_

#TELANGANA_CINEMA_TO_GO_ON_MARATHI_WAY_
!!!

My dear Telangana film makers, as I have mentioned many times through my articles and discussions earlier, here it's a path found by marathi film makers, to make their own identity in indian cinema...!

 Though the Marathi cinema is located in Mumbai, where the mainstream commercial masala mega budget film industry of BOLLYWOOD is situated, Marathi filmdom had carved it's own niche with the constant efforts of its new young film makers since 2 decades.!

If, we would like to take Telangana cinema to make its own journey and impression, the path of marathi cinema is one of the successful strategy, which is totally relied on-- 1)creative content,
2) films based on marathi cultural, ethnic, historical and legendary tales 
3) stories of human touch,
4) contemporary stories of rural life
5) novel storytelling with gripping and different screen play
6) usage of new technical know-how of camera work, music, light scheming, etc
7) stories related to the conflicts facing by middle class people , youth and women
8) stories related to the metro life and it's contradictions in the lives of common public of Mumbai City
9) stories related to the two extreme ends of the mumbai society, i.e., high class page 3 lives and low class struggling lives of slum areas and basthis
10) finding unusual story lines and plots with unconventional ideas and narration

We too can follow the same strategy with low budgets and high creative content to establish Telangana cinema to make its own chapter in indian cinema!!!
Here, it's an example...
Watch HARKANI, a Marathi movie, directed by PRASAD OAK and sonali Kulkarni in the main lead..
Must watch...
---- harikrishna mamidi
25-5-2020