Shubhodayam folks..I am a human being carved out by books..Here, it's my tribute to books in FUSION SHAYAREE style...
1. మానవుని అన్వేషణకి, జ్ఞాన గవేషణకి, ధ్యాన విశ్లేషణకి, స్వీయ ఆవిష్కరణకి ఆలంబన ఎక్కడ ఉంది? సహస్రాబ్దాల కాలం నుండి మనిషి మేధో గదిలో వ్రేళ్ళాడుతున్న ప్రశ్న ఇది. నవాబు లాంటి జవాబు ఒక్కటే--- That is అనుభవం!
షాయద్, Experience is the source of knowledge! Resource of the Human pledge!!
2.తరతరాల experiments ఎన్నో కలిసి Collective Experiencesగా, Selective Memoriesగా, Reflective Impressionsగా, Elective Expressionsగా cumulative రాశిగా మారిందే సత్యం! అనుభవం ముదిరి జ్ఞానంగా, జ్ఞానం చెదిరి తత్వంగా, తత్వం కుదిరి జీవితంగా metamorphosis చెందాక.....
Yes, జీవిత వర్ణమాలలో తొలి అక్షరం--- అనుభవం! హృదయ స్మృతిపేటికలో అనుభవం చెక్కిన వాక్యం--- విజ్ఞానం!!
3. ఆది దినముల యందు అనుభవమే ఉండెను! మదితో, సమ్మతితో, సమూహ గతితో, సమ్మోహన శ్రుతితో, సంకుల సమర స్మృతితో, సంకేత, సంజాత, సంజ్ఞా ప్రతీకలలోకి దిగిపోయి, ఒదిగిపోయి అక్షరంగా ఒరిగిపోయెను. అక్షరం - భాషగా, భాష - రచనగా, రచన - కావ్యంగా,గీతంగా, సుతారంగా పుస్తకమాయెను.
Of course, అనుభవం = జిందగీ = పుస్తకం = consciousness! పుస్తకం is the Record of the Collective Sub-Consciousness!!
4. Fear, Fantasy, Imagination, Invention, Innovation, Introspection, Experimentation, Experience, Verification, Comparison ల అనంతరపు filter కాఫీ రూపం - పుస్తకాధ్యయనం! Word and Meaning అనే వాగర్థాల Chaptersలోని లోయల్లోకి బంగీజంప్ చేశాక...వాగర్ఠావివ సంపృక్తవ్ వాగర్థ ప్రతిపత్తయే శ్లోకాన్ని ఆలోచించి, అవలోకించి, అవధరించాక ....
Indeed, అక్షరం - ఆపాతమధురం! అధ్యయనం -ఆలోచనామృతం!
5. ‘నీలే నీలే అంబర్ పర్ చాంద్ జబ్ ఆయే’ గతాలు, సాగర్ కినారే గీతాలు, బసంత్ బహార్ రాగాలు, మేఘ మల్హర్ స్వరాలు, Greek sophists వర్గీకరించిన జ్ఞాన శకలాలు, ఆశల అంతరిక్షాలు, ఆకాంక్షల ఆకాశాలు, దుఃఖ సముద్రాలు, ద్వంద్వ సంఘర్షణలు, స్వేద భూములు, స్వేఛ్ఛా భువనాలు, స్వార్థ భవనాలు, ఆవేశపు అగ్నిజ్వాలలు, ఆవేదనపు అణుకీలలు, నిర్లిప్త వాయుకీర్తనలు, ఉత్తేజిత మయూర నర్తనాలు, Geography, Polity, Economy, History వర్ణనలు, Physics, Chemistry, Botany, Zoology, Astronomy, IT, Medicine వివరణలు, పియానో, వేణువు, వయోలిన్, వీణ notations, తబలా, మృదంగం, డప్పు, డోలు beats... అన్నిటిని మరుగుజ్జులా, Lilliput లా downsize చేసిన Magic Wand - పుస్తకం!
జీహా, పుస్తకం - outer లోకాన్ని దర్శించే గవాక్షం! Inner లోకాన్ని స్పర్శించే అక్షం!!
6. కితాబ్ ! ఆదాబ్ లను, బేతాబ్ లను, మతాబులను, మతలబులను ఒక వైపు, "మై తేరే లియే హీ సాత్ రంగ్ కె సప్నే చునే" లేపనాలను , చీమలు పెట్టిన పుట్టలో పుటలు, పుటలుగా అందించే ప్యారా మెహబూబ్!
అవును, బుక్ is బ్రహ్మ విష్ణు మహేశ్వర సారం-- సృష్టి స్థితి లయ కారకం! లక్ష్మీ పార్వతీ సరస్వతీ రూపం--- ధన ధైర్య విద్యా ప్రేరకం!!
-------- మామిడి హరికృష్ణ 8008005231

No comments:
Post a Comment