---- మామిడి హరికృష్ణ 8008005231
ఒక పాదం-
మహా తపస్వి జ్ఞాన దీపాన్ని చిదిమేస్తుంది
అస్తిత్వ సూర్యుణ్ణి పాతాళంలోకి తొక్కేస్తుంది
నల్ల మందార పువ్వు ఊపిరిని నలిపేస్తుంది !
ఇంకొక పాదం-
ఆడబిడ్డ జాడ కోసం సముద్రాలను లంఘిస్తుంది
హిమవన్నగ సౌందర్యంలోకి వాయు వేగంతో తేలిపోతుంది
వేలాది ఏళ్ళ చంద్రుడి కవ్వింపుకి సమాధానం చెప్తుంది
ఊపిరి జెండాను ఎగరేయడానికి ఊరికి నడిపిస్తుంది !
మొదటి పాదం-
దుర్వాసుడు, బలి, George Floyd లను
యుగాల నుండి వెంటాడి వేటాడి
పునః పునః చంపేస్తుంది..
I can't Breathe.... ! 1
రెండో పాదం-
హనుమంతుడు, ప్రవరుడు,
Neil Armstrong, వలస కూలీ నారాయణలను
స్థల కాలాలకు అతీతంగా వెతికి వెతికి
మళ్ళీ మళ్ళీ బతికిస్తుంది...
It's a Giant leap for mankind....!! 2
ఇప్పుడు నా పాదానికి
మహిమలు- మాయలు- మర్మాలు తెలియని
రంగు రుచి వాసన అసలే లేని లోకం కావాలి
ఊపిరి పువ్వుకు - ఊరి నవ్వుకు దారి చూపే కాలం రావాలి
as the sound of the marching feet of a determined people...!!! 3
*************************************************
1--- George Floyd చివరి మాటలు!
2--- చంద్రుని పై కాలు మోపినప్పుడు Neil Armstrong రేడియో సందేశం లోని వాక్యాలు !!
3--- నల్ల జాతి హక్కుల యోధుడు Martin Luther King ప్రసంగం లోని నిప్పు కణికలు!!!

No comments:
Post a Comment