#world_poetry_day greetings to u all.. here it's my poem on POETRY, in fushion SHAYAREE style, for your kind reading:::
Fusion శాయరీ on కవిత్వమ్
--- మామిడి హరికృష్ణ
1. కన్నీళ్ళ ద్రావకం లో రక్తపు చుక్కలను జల్లి కొన్ని నవ్వులనీ, ఇంకొన్ని ఆశ్చర్యాలనీ cocktailలా చేసి అక్షరాల ice-cubeలను coolగా, సుఖూన్ గా గ్లాస్ లో జార విడిచాక, గర్దిష్ మె సదా రహేంగే తారే కాస్తా గుండెలని somersault చేయించాక, బొక్క బోర్లా పడి, పక్కా చోర్ లా నిలబడి, mind-blowing questionsతో కలబడి, కో అహమ్, who am I, నేనెవరు? అని పరి పరి విధాల, రక రకాల భంగిమలలో సందేహ పడి, రంధి పడి, గుక్క తిప్పుకోనివ్వని hiccupsని కప్పులు కప్పులుగా త్రాగేసాక, ఈ wonderful world ఆ miniature కప్పులలోకి ఒదగదని, జడ కొప్పులుగా, పురుటి నొప్పులుగా, olympic medals మెప్పులుగా నిరంతరం metamorphosis చెందుతూ ఉంటుందని zen వృక్షం కింద enlighten అయ్యాక, diffusion లెన్ని ఉన్నా, delusions ఎన్ని ఎదురైనా, Confucius సాక్షిగా confusion లన్నీ తొలగిపోయి, ఈ లోకంలో absolute truth అనే పదం కేవలం obsolete అనీ, pure అనేది sure గా లేనే లేదని, ఈ బ్రహ్మాండమంతా ఓ Fusion అనే తత్త్వం బోధపడ్తుంది.. కవిత్వం రా....లి....ప...డు...తుం...ది..
అవును, కవిత్వం ఓ philosophy.... దాని తమన్నా Philanthropy...!
2. పంచీ, నదియా, పవన్, షాయరీ, time and space నిత్య చలనశీలాలు. సత్య గమన గోళాలు. శివం అన్వేషిత మేళాలు. సుందర సహజాత మేళ తాళాలు. 'ఇరుక్కి రారా' అన్నా, ఎరక్కపోయి ఇరుక్కున్నా కదలికే నయా జరోఖా! ప్రవహిస్తున్న Amazon ఒకే ప్రదేశం లో సైతం ఎప్పుడూ ఒకే నీటినివ్వదు. దిల్ సాఫ్ కర్ కె పానీ మె డూబో.. ఏ సచ్చాయీ ఆప్ కో జానా హోగా .. ఖూబ్ కితాబో కో పడే తో ఈ magical realism నీ ముందు మోకరిల్లుతుంది. ముఖాముఖమై, అంతర్ముఖమై, ముఖ రహితమై, మఖలో పుట్టిన ముఖ పుస్తకమై, నీ సమ్ముఖాన పదునైన నఖమై, సుహ్రుల్లేఖగా, ప్రేమలేఖగా, భావార్థాల శిఖగా, శరణార్థుల శంఖంగా మనో తీరానికి కొట్టుకు వస్తుంది.
yes, కవిత్వం ద్విముఖి... ఓ ముఖానిది Agony.. మరో ముఖానిది జవానీ ..!
3. Twister లా పరిభ్రమిస్తూ వందల మైళ్ళ వేగంతో, వేల భావాల ధూళిని లేపుకుంటూ దూసుకు వస్తుంది కవిత్వం. దాని తాకిడికి చిత్తు కాగితమై ఎగిరిపోయి, దాని అలజడికి ఛిన్నాభిన్నమై, ఛిద్రమై, దాని wild దాహానికి ఎముకలన్నీ విరిగిపోయి, muscles అన్నీ melt అయిపోయి కరిగిపోతాను. దాని మోహపు ఊబిలోనే కూరుకుపోతాను. మబ్బుల పొట్లం లో బిగదీసుకుని చంచలిస్తున్న చినుకుని touch చేసి, కొనవేల్లతో మచ్చిక చేసి, ఉప్పదనం లోని మాధుర్యాన్ని తేనెలా గ్రోలుతాను.. లోకం తోటలోని పూలన్నిటినీ ఆఘ్రానిస్తూ వాటిలోని 'గమ్' ని జుర్రుకుని 'నగమ్' ని లిఖిస్తూ ఉంటాను. చిన్నప్పుడు బొంబాయి మిటాయిని గడియారం లా మణి కట్టుకి చుట్టేసి నాలుకతో చప్పరిస్తూ క్షణాలన్నీ మింగేసినట్టు,million nights అఫ్ ఒంటరితనాన్ని relish చేస్తాను
జీహా, కవిత్వం నా ప్రేయసి, ఓ illusion..... కవిత్వం అందాల రాక్షసి, ఓ collision...!
4. నా అంతరాంతర odyssey లో పరిభ్రమించి, ప్రవహించి, మంచులా ఘనీభవించే కవిత్వం Manifestation of an అభిసారిక! రస సింహాసన మార్గంలో సాల భంజిక ! రోదసీ యానంలో నవ మల్లిక! వర్ణాక్షర వాక్యాలంకారాల సముద్రంలో భావాల ఓడపై నేను సాగిపోతున్నపుడు, జలాల లోంచి ఇంద్రజాలంలా ఎగిసి వచ్చి నన్ను కవ్వించే కవిత్వం- ఓ Mythological Siren! మోహావేశ ప్రేరితుడనై, దాహాక్రోశ పీడితుడనై వాలిపోయిన నన్ను అధో లోకాలకు, ఊర్థ్వ జగత్తులకు మేల్కొలిపే కవిత్వం- ఓ factory Siren!
By the way, కవిత్వం ఓ revolution ... అయితేనేం, నాకదే Solution...!
5. ఎప్పుడైనా కన్నీటి ఉప్పదనాన్ని మనసులోకి ఒంపి చూసావా? నన్నే మున్నే ప్యారే న్యారే tender దరహాసాలని పిల్లల బుగ్గల్లో ఏనాడైనా నింపి చూసావా? పగుళ్ళు బారిన భూమిని, నాగేటి సాలు ముడతలని ముఖం నిండా పులుముకున్న వృద్ధురాలినీ, ఆమె 'జుబాన్'పై ఆరిన తడిదనాన్ని, నీరు లేని ఎడారిలో కన్నీరుని కూడా పండించలేని కరువునీ ఏ క్షణమైనా అనుభవించావా? విశ్వపు horizon పై రెండు దిగంతపు అంచులని ఒక్క చోట చేర్చి చూసావా?
నేను చూసాను .. కావ్య కల్పవృక్షం కింద ధ్యాన సమాధిలో కూరుకుపోయి Astral Journey చేసి చూసాను...
True, Poetry is a Tree... విచిత్ర emotional చిత్రాల Geometry...!
#mhk_poetry
#fusion_shayaree
#mhk_art
No comments:
Post a Comment